About Us
శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్
శ్రీ సాయిబాబా వారి ఆదేశానుసారం శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ ను స్థాపించడానికి నిర్ణయం చేయడం జరిగింది.
శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ కాప్షన్ “ఈ ద్వారకామాత గొప్ప దయార్ద్ర హృదయురాలు, ఆమె నిరాడంబర భక్తులకు తల్లి.”
శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ లోగో విశిష్టత : శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ లోగో ఉద్ధేశ్యం శ్రీ సాయి సచ్చరిత గ్రంథములోని 25వ అధ్యాయములో దాము అన్నా గారు ఒకనాడనేకమందితో సాయిబాబా వారి పాదముల వద్ద కూర్చొని యున్నప్పుడు, వారి మనస్సున కలిగిన రెండు సంశయములలో మొదటి సంశయము. శ్రీ సాయిబాబా వారి వద్ద అనేకమంది భక్తులు గుమిగూడుచున్నారు వారందరు సాయిబాబా వారి వలన మేలు పొందెదరా? దీనికి సాయిబాబా వారు యిట్లు జవాబిచ్చెను. “మామిడిచెట్ల వయిపు పూత పూసియున్నప్పుడు చూడుము. పువ్వులన్నియు పండ్లు అయినచో, నెంత మంచి పంట యగును? కాని యట్లు జరుగునా? పువ్వుగానే చాల మట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును. కొన్ని మాత్రమే మిగులును.
లోగో అర్థము శ్రీ సాయిబాబా వారి చుట్టూ గుంపులు గుంపులు గూమికొని ఉన్న భక్త జనం మామిడి చెట్టుకు నిండుగా పూసిన పువ్వు వలె ఉంటారు. కానీ శ్రీ సాయిబాబా వారిని సరిగా అర్థం చేసుకోక గాలికి చెట్టుకు ఉన్న కొంత పువ్వు, పిందెలు ఎలా రాలిపోతాయో మనకై మనమే వారి పవిత్రమైన పాదాల చెంత నుంచి రాలిపోతున్నాము. అలా జరగకుండా ప్రతి సాయి బంధువు శ్రీ సాయి నాథుల వారిని అర్థం చేసుకొని పవిత్రమైన వారి పాదాలను పూర్తిగా నమ్మి మామిడి చెట్టుకు మామిడి కాయ పక్వంకు వచ్చి పండు అయినట్లు శ్రీ సాయిబాబా వారి పవిత్రమైన పాదాల చెంత స్థిరంగా ఉండిపోవాలనే ఉద్దేశ్యం.
- మన శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ కు 2022వ సంవత్సరం సెప్టెంబర్ నెల 27వ తేదిన రిజిస్ట్రేషన్ జరిగింది. రిజిస్ట్రేషన్ నెం : 14/2022 మరియు 2023వ సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదిన సంస్థాన్ ట్రస్ట్ లో కొన్ని చిన్న చిన్న మార్పులతో మరొక రిజిస్ట్రేషన్ జరిగింది. రిజిస్ట్రేషన్ నెం : 2/2023.
- మన శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ కు మన భారతదేశ కేంద్ర ప్రభుత్వం అధికారికమైన NGO/TRUST/SOCIETY ల సమాచారాన్ని సేకరించే DARPAN PORTAL లో కూడా నమోదు అవటం జరిగింది. DARPAN UNIQUE ID : AP/2022/0328995
- మన శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ కు జరిగే ఆర్థిక ట్రాన్సక్షన్ లకు సంబంధించి ఇన్-కమ్ టాక్స్ డిపార్టుమెంటు కు సంబంధించి 12A, 80G సర్టిఫికెట్స్ పొందిన సంస్థ. 12A, 80G Incom Tax Registered, Approval No : ABETS9921KF20231
- మన శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ పేరుకు భారతదేశ ప్రభుత్వ TRADE MARKS లో కూడా రిజిస్ట్రార్ అయిన సంస్థ.
- మన శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ కు వచ్చిన విరాళాలను ప్రతి సంవత్సరం నిబ్బద్దతతో ఇన్-కమ్ టాక్స్ డిపార్టుమెంటు కు ఫైల్ చేస్తున్న సంస్థ.
సంస్థాన్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశాలు
- శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం శ్రీ సాయినాథుల వారి పవిత్రమైన పాద స్పర్శ ముద్దాడిన శిరిడీ పుణ్య భూమిలో శ్రీ సాయి నాథుల వారి మీద ఉన్న ప్రేమతో శిరిడీకి వెళ్లాలనుకొనే మన ప్రాంతం వారు కొన్ని రోజులు శిరిడీలో ప్రశాంతంగా గడపాలనుకొనే సాయి బంధువులు మరియు దర్శనము కోసం వెళ్లే సాయి బంధువులకు వీలుగా అక్కడ ఒక వసతి సముదాయం నిర్మించండం కోసం…
- శ్రీ సాయి నాథుల వారి పవిత్రమైన పాదాలు ముద్దాడిన శిరిడీ పుణ్యభూమికి పోవాలి అనే తపన ఉండి వివిధ కారణాల వలన (ఆర్థిక కారణాల వల్ల, భాష సమస్య వల్ల, తోడు లేని కారణం వలన కానీ, టిక్కెట్లు రిజర్వేషన్లు సమస్య వలన) ఇంతవరకు శిరిడీ పుణ్యక్షేత్రం దర్శించని సాయి బంధువులను శిరిడీ పుణ్యభూమి దర్శించాలనే తపన తీర్చడం కోసం…
- పరమ పవిత్రమైన మరియు శ్రీ సాయి మరో ప్రతిరూపం అయిన శ్రీ సాయి సచ్చరిత గ్రంథము చదవాలనే తపన ఉండి ఆ సచ్చరితామృతం దొరకని సాయి బంధువులకు సచ్చరితామృతాన్ని అందించడం కోసం…
- పవిత్రమైన శ్రీ సాయి నామము విలువ తెలిసి నిత్యం శ్రీ సాయి ధ్యాసలో గడపాలనే ఉదేశ్యంతో శ్రీ సాయి నామ లిఖితాలను రాయాలనుకొనే తపన ఉన్న సాయి బంధువులకు శ్రీ సాయి నామ లిఖిత పుస్తకాలను అందించడం కోసం…
- శ్రీ సాయిబాబా వారు ఆచరణ ద్వారా చూపిన సహాయ కార్యక్రమాలలో మనకు వీలు అయిన కొన్ని సహాయ కార్యక్రమాలు అందించడం కోసం…
- మనిషి నిత్యా జీవితంలో ప్రమాదాలు జరిగినప్పుడు గాయాలు అయ్యి రక్త స్రావం జరిగిన సందర్భలలో కానీ, గర్భిణీ స్త్రీలు ఆపరేషన్ జరిగే సమయాలలో, చిన్న చిన్న ఆపరేషన్ల సమయంలో రక్తం చాలా అవసరం అవుతుంది అటువంటి సందర్భంలో శ్రీ సాయినాథుల వారి దాయమృతమైన కృప వలన కొంత మంది సాయి బంధువులు రక్తం ఇచ్చి కొంత మందికి అయిన రక్త సహాయం చేయాలనే ప్రయత్నం కోసం…
- శ్రీ సాయిబాబా వారి ఆదేశానుసారం కొన్ని చిన్న చిన్న సహాయ కార్యక్రమాలు చేయాలనే ప్రయత్నం కోసం…
- మన అందరం శ్రీ సాయినాథుల వారు చెప్పిన మాటలు తెలుసుకొని వాటిలో కొన్నింటిని అయిన ఆచరణలో పెట్టి వారి పాదమార్గంలో ప్రయాణించాలనే చిన్న ప్రయత్నం కోసం…
శ్రీ సాయి నాథుల వారి దయామృతం వలన వారు మనకు ప్రసాదించిన శక్తి మేరకు పై కార్యక్రమాలను చేయాలనే ప్రయత్నం కోసం శ్రీ సాయి నాథుల వారి ఆదేశానుసారం ఏర్పాటు చేయబడ్డ ఒక నిస్వార్థ స్వచ్ఛంద సంస్థ.
గతములో చేసిన కార్యక్రమాలు
శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్, శ్రీ సాయిబాబా వారి దయ వలన, వారు మనకు ప్రసాదించిన శక్తి మేరకు, ప్రస్తుతము వరకు బద్వేలు పట్టణములో ప్రజలకు అత్యవసర పరిస్థితులలో రక్తము కావాల్సి ఉండి మన దృష్టికి వచ్చిన కొందరి ప్రజలకైనా, సాయి భంధువులు స్వచ్చందంగా రక్తము ఇచ్చి అ అత్యవసర పరిస్థితులలో ఇబ్బంది పడుతున్న వారికీ చాల ఉపయోగపడుతున్నారు. మన దృష్టికి వచ్చిన కొన్ని అనాధశ్రయాలలో, వృద్ధాశ్రయాలలో, అంధుల పాఠశాలలో, గోశాలలో శ్రీ సాయిబాబా వారి పుణ్యతిధి సందర్భంగా చిన్న చిన్న కార్యక్రామాలు జరుగుతున్నాయి. 2021వ సంవత్సరము నందలూరులో జరిగిన వరద విపత్తుకు సర్వం కోల్పోయిన ప్రజలకు సాయిబాబా వారి తరుపున మన శక్తి కొద్ది ఒక చిన్న కార్యక్రమం చేయడం జరిగింది. మరియు శ్రీ సాయిబాబా వారికీ సంబందించిన అమృతమైన విజ్ఞాన బాండగారాన్ని సాయిబాబా వారే అప్పటి పరిస్థితులను బట్టి శ్రీ సాయి కుటుంబం WHATSAP గ్రూప్ ద్వార పొందు పరుచుకుంటున్నారు.
శ్రీ సాయిబాబా వారి పుణ్యతిధి కార్యక్రమాలు-2022
శ్రీ సాయిబాబా వారి పుణ్యతిధి సందర్భంగా బ్రహ్మంగారి మఠం, మల్లెపల్లె లో చిన్న పిల్లల అనాథ ఆశ్రమంలో బట్టల బహుకరణ కార్యక్రమ దృశ్యం
శ్రీ సాయిబాబా వారి పుణ్యతిధి సందర్భంగా కడప అంధుల పాఠశాలలో భోజన కార్యక్రమ దృశ్యం
శ్రీ సాయిబాబా వారి పుణ్యతిధి సందర్భంగా బ్రహ్మంగారి మఠం, బాలమ్మ సత్రములో భోజన కార్యక్రమ దృశ్యం
శ్రీ సాయిబాబా వారి పుణ్యతిధి సందర్భంగా బ్రహ్మంగారి మఠం, బాలమ్మ సత్రములో భోజన కార్యక్రమ దృశ్యం
Add Your Heading Text Here
Add Your Heading Text Here
అత్యవసర సమయంలో సాయి భక్తులు రక్తం ఇస్తున్న దృశ్యం
అత్యవసర సమయంలో ఎవ్వరు తోడు లేని వారికి మన దృష్టికి వచ్చిన ఒకరికి శ్రీ సాయిబాబా వారు ఉన్నారనే అనే ధైర్యం.
TRUST MEMBERS
NAMES
|
DESIGNATION
|
CELL NO.
|
---|---|---|
THUMMALAPENTA REMASH BABU
|
GENERAL SECRETARY LIFE TRUSTEE
|
8985093613
|
KONKALA SUNEEL
|
JOINT SECRRETARY LIFE TRUSTEE
|
8074436305
|
VURIBINDI RAMANJANEYA REDDY
|
TREASURER LIFE TRUSTEE
|
9030892947
|
ATHIKARI BALA SUDHAKAR
|
MEMBER LIFE TRUSTEE
|
8125344404
|