







శ్రీ సాయిబాబా వారి ఆదేశానుసారం శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ ను స్థాపించడానికి నిర్ణయం చేయడం జరిగింది.
శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ కాప్షన్ “ఈ ద్వారకామాత గొప్ప దయార్ద్ర హృదయురాలు, ఆమె నిరాడంబర భక్తులకు తల్లి.”
శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ లోగో విశిష్టత : శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ లోగో ఉద్ధేశ్యం శ్రీ సాయి సచ్చరిత గ్రంథములోని 25వ అధ్యాయములో దాము అన్నా గారు ఒకనాడనేకమందితో సాయిబాబా వారి పాదముల వద్ద కూర్చొని యున్నప్పుడు, వారి మనస్సున కలిగిన రెండు సంశయములలో మొదటి సంశయము. శ్రీ సాయిబాబా వారి వద్ద అనేకమంది భక్తులు గుమిగూడుచున్నారు వారందరు సాయిబాబా వారి వలన మేలు పొందెదరా? దీనికి సాయిబాబా వారు యిట్లు జవాబిచ్చెను. “మామిడిచెట్ల వయిపు పూత పూసియున్నప్పుడు చూడుము. పువ్వులన్నియు పండ్లు అయినచో, నెంత మంచి పంట యగును? కాని యట్లు జరుగునా? పువ్వుగానే చాల మట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును. కొన్ని మాత్రమే మిగులును.
లోగో అర్థము శ్రీ సాయిబాబా వారి చుట్టూ గుంపులు గుంపులు గూమికొని ఉన్న భక్త జనం మామిడి చెట్టుకు నిండుగా పూసిన పువ్వు వలె ఉంటారు. కానీ శ్రీ సాయిబాబా వారిని సరిగా అర్థం చేసుకోక గాలికి చెట్టుకు ఉన్న కొంత పువ్వు, పిందెలు ఎలా రాలిపోతాయో మనకై మనమే వారి పవిత్రమైన పాదాల చెంత నుంచి రాలిపోతున్నాము. అలా జరగకుండా ప్రతి సాయి బంధువు శ్రీ సాయి నాథుల వారిని అర్థం చేసుకొని శ్రద్ధ-సబూరి లతో పవిత్రమైన వారి పాదాలను పూర్తిగా నమ్మి మామిడి చెట్టుకు మామిడి కాయ పక్వంకు వచ్చి పండు అయినట్లు శ్రీ సాయిబాబా వారి పవిత్రమైన పాదాల చెంత స్థిరంగా ఉండిపోవాలనే ఉద్దేశ్యం.
శ్రీ సాయి నాథుల వారి దయామృతం వలన వారు మనకు ప్రసాదించిన శక్తి మేరకు పై కార్యక్రమాలను చేయాలనే ప్రయత్నం కోసం శ్రీ సాయి నాథుల వారి ఆదేశానుసారం ఏర్పాటు చేయబడ్డ ఒక నిస్వార్థ స్వచ్ఛంద సంస్థ.
శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ ను మొదలుపెట్టడానికి ముఖ్యమైన కారణం శ్రీ సాయినాధుల వారి పవిత్రమైన పాద స్పర్శ ముద్దాడిన శిరిడీ పుణ్యభూమిలో శ్రీ సాయినాధుల వారి మీద ఉన్న ప్రేమతో శిరిడీకి వెళ్లాలనుకునే మన ప్రాంతం వారు కొన్ని రోజులు పాటు ప్రశాంతంగా గడపాలనుకునే సాయి బంధువులకు మరియు దర్శనం కోసం వెళ్లే మన సాయి బంధువులకు శిరిడీలో ఒక వసతి సముదాయం నిర్మించడం కోసం 2023వ సంవత్సరము జూన్ నెల 27వ తేదీన శిరిడీ గ్రామంలో శ్రీ ద్వారకామాయి తల్లి ఒడికి అత్యంత సమీపంలో 500 మీటర్ల దూరంలో ఆర్టీసీ బస్టాండ్ వెనుక 1.5 గుంట (3.75 సెంట్ల) స్థలాన్ని కొంతమంది సాయి బంధువుల అమూల్యమైన మాట, ధన సహాయ సహకారాలతో శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ పేరు మీద కొనుగోలు చేయడం జరిగింది. తరువాత ఆ స్థలాన్ని శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ పేరు మీద ఆన్లైన్ రికార్డులలో కూడా నమోదు చేయడం జరిగింది. తదనంతరం శ్రీ సాయినాధుల వారి ఆదేశానుసారం 2023వ సంవత్సరం అక్టోబర్ నెల 24వ తేదీన శ్రీ సాయిబాబా వారి పుణ్య తిధి సందర్భంగా శ్రీ సాయిబాబా వారు ప్రసాదించిన స్థలానికి కొంతమంది సాయి బంధువుల సమక్షంలో భూమి పూజ కార్యక్రమం చాల మంచిగా జరిగింది. శ్రీ సాయినాధుల వారు తన పాద స్పర్శ తాకిన శిరిడీ నేలపై మనకు ప్రసాదించిన ఈ స్థలానికి శ్రీ సాయి భూమి అనే పేరును నామకరణం చేయడం జరిగింది. ఈ సాయి భూమిలో వసతి సముదాయం నిర్మించడానికి కావలసి ఉన్న బిల్డింగ్ పర్మిషన్లు కూడా కొన్ని రోజులకు రావడం జరుగుతుంది. తరువాత వసతి గృహం కట్టే పని కూడా ప్రారంభించడం జరుగుతుందని ఆశిస్తున్నాము.
మేము ఇలా శిరిడీలో స్థలం తీసుకుంటున్నాము అని కొందరి సాయి బంధువులకు చెప్పగా వారు శ్రీ సాయిబాబా వారి మీద ఉన్న ప్రేమతో ఆ స్థలము డీటెయిల్స్ ఎక్కడ, ఎంత దూరం, ఎంత అమౌంట్ ఇలా ఏ ఒక్క మాట కూడా అడగకుండా మా మీద ఉన్న నమ్మకంతో నిస్వార్థంగా పెద్ద మొత్తంలో ధన సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క సాయి బంధువులకు శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ తరుపున పేరు పేరున హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటున్నాము.
ఈ శ్రీ సాయి భూమి అనే స్థలాన్ని మనం కొనుగోలు చేసిన దానికి మనకు ఇంకా కొంత ధనం సమకూరాల్సి ఉంది, కాబట్టి దయచేసి ఈ మహోత్రమైన కార్యక్రమం మంచి కార్యక్రమం అని మీకు అనిపిస్తే మీకు తోచినంత ధన సహాయాన్ని శ్రీ సాయిబాబా వారి మీద ఉన్న ప్రేమతో అందించవలసినదిగా మనస్ఫూర్తిగా శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ తరుపున కోరుకుంటున్నాము. మీరు చేసిన ఈ మేలుకు మనం త్వరలో శ్రీ సాయి నాథుల వారి పాదాలు ముద్దాడిన శిరిడీ పుణ్యభూమి లో ఒక వసతి సముదాయం నిర్మించుకోబోతున్నాము అని చెప్పటానికి చాలా ఆనందంగా ఉంది.
శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ కు మీరు అందించే ఈ ధన సహాయం ఒక్క రూపాయి కూడా వృధా పోదని మొత్తం సద్వినియోగం జరిగి ఒక మంచి పుణ్య కార్యక్రమానికి ఉపయోగపడుతుంది.
ఇట్లు
శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్.
16/04/2024 నుండి 18/04/2024 వరకు
ప్రారంభరోజు | మంగళవారం (మొదటి రోజు – పల్లకి ఉత్సవం) | 16/04/2024 | |
ముఖ్య రోజు | బుధవారం (ముఖ్య మైన రోజు రథ యాత్ర) | 17/04/2024 | |
చివరి రోజు | గురువారం(చివరి రోజు) | 18/04/2024 | |