శిరిడీ సమాధి మందిర సాయిబాబా వారి మూర్తి వైభవం
1954వ సంవత్సరం వరుకు బూటి వాడలో చిత్ర పటం మాత్రమే ఉండటం జరిగింది. రాను రాను భక్తుల సంఖ్య అధికం అయ్యే కొద్ది 1952వ సంవత్సరం లో సంస్థాన్ ట్రస్ట్ వారు చిత్రపటం స్థానంలో బాబా గారి మూర్తిని ప్రతిష్టించాలని నిర్ణయించడం జరిగింది. బాబా గారి పాలరాతి మూర్తి కోసము కావలసిన శిల ను బాబా వారే సిద్ధం చేసుకున్నారు. బొంబాయి ఓడ రేవులో ఇటాలిన్ మార్బుల్ కు చెందిన శిల అక్కడ పడి ఉండటం. దానిని ఓడ రేవు అధికారులు వేలం వేయడం ఆ వేలంలో ఆ శిలను కొనుక్కున్న వ్యక్తి సాయిబాబా శిలను చెక్కడానికి సంస్థాన్ ట్రస్ట్ వారికీ పంపడం జరిగింది. ఆ శిలను సంస్థాన్ ట్రస్ట్ వారికి చేరిన తరువాత బాబా వారి మూర్తి జీవ కళ ఉట్టి పడేలా ఏర్పాటు చెయలని నిర్ణయించి ఇందు కోసం దేశం లోని ప్రత్యేక శిల్పులకు ఆహ్వానం పంపింది. ఇందుకోసం సంస్థాన్ ట్రస్ట్ వారు మహారాష్ట్ర కు చెందినా 5 మంది శిల్పులను బాబా వారి నమూనా మూర్తిని చెక్కడం కోసం ఎంపిక చేసింది. ఈ ఐదు మంది శిల్పులకు సంస్థాన్ ట్రస్ట్ వారు బాబా వారి ఒక చిన్న బ్లాకు అండ్ వైట్ ఫోటో ను ఇచ్చారు. ఈ ఐదుగురి లో ఒకరు బాలాజీ వసంత్ తాలిమ్. తాలిమ్ సంస్థాన్ ట్రస్ట్ వారు ముందు ఒక ప్రతిపాదన పెట్టారు అది అందరికి నిరాశ గురికాకుండా ఒక్కొక్కరికి 5 వేల రూపాయలు ఇవ్వాలని. అప్పుడు సంస్థాన్ ట్రస్ట్ పరిస్థితి అంతంత మాత్రం గానే ఉన్న బాబా వారి పనికి తగిన కూలి ఇస్తారు కాబట్టి సంస్థాన్ ట్రస్ట్ వారు కూడా వారి గౌరవానికి తక్కువ లేకుండా కొంత సమకూర్చి వారికీ అందజేశారు. గౌరవం దక్కిందని అదృష్టవంతులమని వారు ఆనందించారు.
సాధారణంగా శిల్పాన్ని మలచాలంటే ఆ వ్యక్తిని ఎదుట కూర్చోబెడుతారు. కానీ ఇక్కడ సంస్థాన్ ట్రస్ట్ వారు ఒక చిన్న బ్లాకు అండ్ వైట్ ఫోటో మాత్రమే ఇచ్చారు. ఆ శిల్పులు ఎవ్వరు బాబా వారిని ప్రత్యక్షంగా చూడలేదు. కేవలం సంస్థాన్ ట్రస్ట్ వారు ఇచ్చిన చిన్న బ్లాకు అండ్ వైట్ ఫోటో మాత్రమే వారికి ఆధారం. నమూనా మూర్తిని ఏర్పాటు చేయడానికి 2 నెలల కాలపరిమితి ఇచ్చారు. తాలిమ్ బాబా వారిని ప్రతి రోజు ఈ విధంగా ప్రార్ధించే వారు ఒక్క సారి మీ దర్శనాన్ని ప్రసాదించి మిమ్మల్ని పోలిన ఈ సజీవ మూర్తిని మలిచేందుకు నాకు శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించు అని ప్రార్ధించే వారు. తాలిమ్ నమూనా శిల్పం కోసం శిలను ఏర్పాటు చేసుకున్నారు. రోజులు గడుస్తున్నాయి తాలిమ్ కు బాబా వారి దర్శన భాగ్యం కలుగలేదు. నమూనా శిల్పానికి బాబా వారి ముఖాన్ని మలచలేదు. కాలపరిమితి ఇంకా పది రోజులు మాత్రమే ఉంది. ఇంతలో సంస్థాన్ ట్రస్ట్ నుండి శిల్పం పూర్తి అయివుంటే తాము వచ్చి నమూనా శిల్పాన్ని చూస్తామని కబురు పంపారు. తాలిమ్ తన ప్రార్ధనను రాత్రింపగళ్ళు కొనసాగించారు. ఒక రోజు తెల్లవారుజామున తాలిమ్ తన స్టూడియోకి వెళ్లారు. ఆ స్టూడియో లో రెండు గదులు ఉంటాయి. వెనుక గది లో శిల్ప నమూనాలు, రెండవ గదిలోకి చెందినా విద్యుత్ స్విచ్ లు ఉండేవి. తాలిమ్ చీకట్లోనే వెనుక గదిలోకి వెళ్లారు. ఆ గదిలో ఆర్చర్యం ! అద్భుతం ! బాబా వారి నమూనా మూర్తి కోటి సూర్య ప్రభాలతో వెలిగి పోతుంది. ఆ వెలుగును తట్టుకొనలేని తాలిమ్ కళ్ళు మూసుకున్నారు. అప్పుడు వినిపించింది “నన్ను మనస్సు పూర్తిగా దర్శించుకొను అంటూ బాబా వారు తాలిమ్ ముందు సాక్షాత్కరించారు. వారి ఇరువురి చూపులు ఏకం అయ్యాయి. బాబా వారి కనులు తప్ప వేరేది చూడలేదు. బాబా వారిని తృప్తి గా చూసారు.” మిగిలిన 4 శిల్పులు చేసినటువంటి మూర్తిలను చూసాం చివరగా తాలిమ్ మలిచిన మూర్తిని చూడటానికి వస్తున్నామని సంస్థాన్ ట్రస్ట్ కబురు పంపింది. తాలిమ్ వారిని వెనక గది లోకి తుడుకొని పోయ్యారు. శిల్పం ముందు వారు నిల్చున్నారు. తాలిమ్ తెరను తొలగించారు ట్రస్ట్ సభ్యులు నిశ్శబ్దంగా చూస్తున్నారు. అద్భుత సృష్టిని చూసిన వారి కనుల వెంట ఆనంద భాష్పలు కారాయి. తరువాత సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు తాలిమ్ దగ్గరకు వచ్చి కేవలం మీరు మాత్రమే మూర్తిని మల్చగలరని ముక్త కంఠంతో అన్నారు. తాలిమ్ గారికి ఎంతటి అదృష్టం స్వయంగా బాబా వారు దర్శనం ఇచ్చి తన మూర్తిని తానే తాలిమ్ చేత చెక్కించుకున్నారు. ఆ మూర్తి జీవ కల ఉట్టిపడేలా ఉంటుంది. ఆ కళ్ళు అందరిని ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో తన ఒడి లోకి ఆహ్వానించే విధంగా ఉంటాయి. ఆ మూర్తిని బాగా పరిశీలిస్తే బాబా వారు ఒకసారి ఉన్నట్టు మరోసారి ఉండరు. ఎప్పుడు చూసిన నిత్య నూతనంగా ఉంటారు. ఈ తాయారు చేసిన మూర్తిని సమాధి మందిరంలో చిత్రపటం ఉన్న స్థానములో 1954వ సంవత్సరం ఆక్టోబర్ 7వ తేదీన స్వామి శరణానంద చేతుల మీదుగా ప్రతిష్టించ బడింది.